![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -340 లో.. మురారికి గతం గుర్తుకు రావడంతో అందరు సంతోషంగా ఉంటారు. కానీ ఒక ముకుంద మాత్రం డల్ గా ఉంటుంది. కోపంగా ఇంట్లోకి వెళ్లి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది. అది చూసి మధు ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు కంగారుగా ముకుంద దగ్గరికి వస్తారు. ఆ తర్వాత కృష్ణ గౌతమ్ ఇద్దరు తనకి ట్రీట్ మెంట్ ఇస్తారు. ఇక తనకి ఎలాంటి ఇబ్బంది లేదని భవానికి గౌతమ్ చెప్తాడు.
మురారికి తన గతం గుర్తుకు రావడం ముకుందకి ఇష్టం లేదు అందుకే ఇలా చేసిందని రేవతి అంటుంది. దాంతో భవానికి కోపం వచ్చి.. ఎందుకు అలా మాట్లాడుతున్నావ్? తన జీవితం ఏం అవుతుందోనని అర్థం కాకా ఇలా చేసిందని అంటుంది. మరొకవైపు మురారి దగ్గరికి నందు వెళ్తుంది. నందు వెళ్ళగానే మురారి తన మనసులో మాటలన్నీ చెప్తాడు. మా ఇంట్లో వాళ్ళు ఇన్ని రోజులుగా కృష్ణనే నా భార్య అనే విషయం చెప్పకుండా, నన్ను పిచ్చి వాడిలా చూసారని మురారి అడుగుతాడు. అమ్మకి ఎదరుచెప్పలేక ఇలా మౌనంగా ఉన్నామని నందు చెప్తుంది. ఆ తర్వాత మురారి దగ్గరికి.. ముకుంద మురారీల శుభలేక తీసుకోని భవాని వస్తుంది. అది మురారికి ఇవ్వగానే.. బాగుంటుందని మురారి అంటాడు. నీకు గతం గుర్తుకు వచ్చింది కాబట్టి చెప్పనవసరం లేదనుకుంట.. వచ్చే శుక్రవారం నీకు ముకుందకి పెళ్లి అని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత తనని అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పకుండా మోసం చేశారని భవాని అంటుంది. మేం అగ్రిమెంట్ మ్యారేజ్ కాస్తా పర్మినెంట్ మ్యారేజ్ చేసుకుందామని మీకు చెప్పేలోపే ఇలా జరిగిందని మురారి చెప్తాడు.
కృష్ణ తన చిన్నాన్నతో కలిసి ఇలా చేసిందంటు చెప్పి, నీ రూపం మార్చారని భవాని చెప్తుంది. వాళ్ళు చెయ్యలేదని నిరూపిస్తానని మురారి అంటాడు. నిరూపించు కానీ ఈ శుక్రవారం లోపే జరగాలి నిరూపిస్తే మీ పెళ్ళిని అంగీకరిస్తాను లేకపోతే ముకుందకి నీకు పెళ్లి అని భవాని చెప్తుంది. నిరూపిస్తానని మురారి చెప్తాడు. ఆ తర్వాత మీరు తప్పకుండా నిరూపిస్తారు. ఆ నమ్మకం నాకు ఉందని మురారీతో కృష్ణ అంటుంది. తరువాయి భాగంలో.. కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. అలా బయటకు వెళదామా అంటాడు. కృష్ణని మాటల్లో పెట్టి కృష్ణ చెంపపై ముద్దు పెడతాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |